వనస్థలిపురం, జూలై 22 : ఆహారం వికటించి ఒకరు మృతి చెందంగా ఏడుగురు కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురైన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. చింతలకుంటలో నివాసముండే శ్రీనివాస్ యాదవ్ ఆర్టీసీలో పని చేస్తున్నాడు. ఆదివారం కటుంబంతో బోనాల పండుగను జరుపుకున్నారు. పండుగరోజు మటన్, బోటీ, చికెన్ తీసుకువచ్చి విందు భోజనం చేశారు. కాగా కూరలు మిగలడంతో ఫ్రిజ్‌లో ఉంచి సోమవారం కూడా తిన్నారు.
అది ఫుడ్ పాయిజన్ కావడంతో మంగళవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. శ్రీనివాస్‌ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకువెళ్లగా అక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పండుగ పూట కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.