హైదరాబాద్: నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో (Rajendranagar) దారుణం జరిగింది. ఓ వృద్ధుడిని మరో వృద్ధుడు గ్లాస్ ముక్కతో పొడిచి చంపాడు. రాజేంద్రనగర్‌లోని బండ్లగూడలో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో సాదిక్ హుస్సేన్, అయాజ్ అబ్దుల్ అనే వయోధికులు ఉంటున్నారు. అయితే ఇద్దరి మధ్య ఒక విషయంలో మాటామాటా పెరిగి ఘర్షణ దారితీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన అయాజ్ అబ్దుల్.. సాదిక్ హుస్సేన్‌ను కిటికీ గ్లాస్‌తో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన హుస్సేన్‌ను స్థానికులు దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడు అయాజ్ అబ్దుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.