ఖైరతాబాద్, నవంబర్ 14 : భారీ వృక్షం ఆటోపై పడటంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన సయ్యద్ జానీ ఆటోడ్రైవర్. రోజు వారీగా ఆటో నడుపుతూ.. మింట్ కాంపౌండ్ వద్ద ఆటోను ఆపి అందులో కూర్చున్నాడు.
అదే సమయంలో ఒక్కసారిగా భారీ వృక్షం ఆటోపై పడటంతో తల, భుజానికి గాయాలయ్యాయి. చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.