హైదరాబాద్: హైదరాబాద్ సనత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున ముగ్గురు యువకులు ఒకే బండిపై దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సనత్‌నగర్ వద్ద మోటారు సైకిల్ అదుపు తప్పడంతో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉన్నది.