హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బస్సును ఓవర్టేక్ చేస్తుండగా స్కూటర్ అదుపుతప్పి.. బస్సు కింద పడి యువకుడు మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా కార్ఖానాగడ్డకు చెందిన షేక్ సక్లిన్, మహమ్మద్ పుర్కన్ స్కూటర్‌పై మెహిదీపట్నంకు వెళ్తున్నారు. ఈ క్రమంలో శామీర్‌పేట సమీపంలో ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయడానికి యత్నించారు.
ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో వెనక కూర్చున్న వ్యక్తి కిందపడిపోయాడు. దీంతో బస్సు వెనక టైరు అతని పైనుంచి వెళ్లడంతో మృతిచెందాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
బైక్ పై ఆర్టీసి బస్సును ఓవర్ టేక్ చేయబోయి.. బస్సు కింద పడి యువకుడి మృతి
హైదరాబాద్ – శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా అదుపుతప్పి బస్సు కింద పడి ఒక యువకుడు మృతి చెందాడు.
కరీంనగర్ జిల్లా కార్ఖానా గడ్డకు చెందిన షేక్ సక్లిన్, మహమ్మద్… pic.twitter.com/GYYJMegFZv
— Telugu Scribe (@TeluguScribe) October 26, 2024