మన్సురాబాద్, మే 26: సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వలన కాలనీల్లో భద్రత పెంపొందుతుందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా తెలిపారు. హైదరాబాద్ కొత్తపేట డివిజన్ పరిధి న్యూ మారుతి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 56 సీసీ కెమెరాలను స్థానిక కార్పొరేటర్ నాయి కోటి పవన్ కుమార్ తో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ.. ఒక్కో సీసీ కెమెరా వంద మంది కానిస్టేబుళ్లతో సమానమని తెలిపారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిసా వెంటనే సీసీ కెమెరాలు ద్వారా గుర్తించవచ్చునని పేర్కొన్నారు.