మేడ్చల్, జనవరి 20 : కంటి వెలుగు శిబిరానికి రెండో రోజు అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్, మూడుచింతపల్లి మండలాలు, పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్నగర్ కార్పొరేషన్లతో పాటు ఏడు మున్సిపాలిటీల్లో 18 కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 2269 మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. 744 మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వగా, 253 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. కేంద్రాల వారీగా చేసిన పరీక్షలు ఈ విధంగా ఉన్నాయి. కీసర మండల కేంద్రంలోని నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ నారాయణరావు సందర్శించారు. ఆయనతో పాటు కీసర మండల వైద్యాధికారి డాక్టర్ సరిత ఉన్నారు.
నాకు దగ్గర చూపు బాగలేకుండే. బీపీ, షుగర్తోటి ఆపరేషన్ చేసుకోవాలంటే బయపడ్డ. గ్రామ పంచాయతీలో కేసీఆర్ తరపున కండ్ల పరీక్షలు చేస్తుర్రని తెలిస్తే వచ్చిన. ఇప్పటికే ఒకసారి కన్ను ఆపరేషన్ చేసుకున్న.. కొంత మసకమసక కనిపిస్తుంది. డాక్టర్లు చూసి మంచి అద్దాలు ఇచ్చిర్రు. దగ్గర చూపు కనిపిస్తుంది. ఆ అయ్య సల్లగుండాలే.
– గూదె బాలమ్మ, మూడుచింతలపల్లి
కంటి వెలుగు శిబిరాలు పేదలకు మేలు చేస్తున్నది. ఎంతో మంది కంటి చూపు సరిగ్గా లేకున్నా దవాఖానలకు వెళ్లడం లేదు. మా వద్దకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి, అద్దాలు ఇవ్వడం గొప్ప విషయం.
– సుప్రభా, మేడ్చల్