బంజారాహిల్స్, ఏప్రిల్ 22: ప్రపంచభూమి దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కువద్ద లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. మొక్కలు నాటడంతో పాటు వృక్షాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నినాదాలు చేశారు. కేబీఆర్ నేషనల్ పార్కుతో పాటు చుట్టుపక్కల ఉన్న వృక్షాలను కాపాడుకోవాలంటూ తాము పదేండ్లుగా పోరాటం చేస్తున్నామని, కోర్టులను సైతం ఆశ్రయించామని పలువురు పర్యావరణ ప్రేమికులు తెలిపారు.
గ్లోబల్ వార్మింగ్‌తో భూమికి ఎంతో నష్టం జరుగుతున్నదని, అనేక ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయని లీడ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ ఎన్.సుదర్శన్ ఆచార్య పేర్కొన్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేయాలని, ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో చేతిసంచులు వాడాలని కోరారు.