సిటీబ్యూరో, అక్టోబరు 11 (నమస్తే తెలంగాణ ) ః ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది.. ఆడంబరాలు, విందులు, వినోదాలు, ప్రలోభాలు, పంపకాలు, ప్రచార ఆర్భాటాలు ఒకటా, రెండా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం.. పోలింగ్‌కు నెల రోజుల పాటు సమయం ఉండడంతో అటు పార్టీలు, ఇటు అభ్యర్థులు, ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. 30 రోజుల పాటు ఖర్చు పెరిగి తడిసి మోపెడవుతుందని పరేషాన్ అవుతుంన్నారు. నెల రోజుల పాటు విస్తృతంగా ఓటర్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. క్యాంపెయిన్ కోసం బూత్‌ల వారీగా ఖర్చులు భరించాలి. ప్రచారంలో మంది మార్బలం ఉండాలి.
ప్రచార రథాలు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంచాలి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. కరపత్రాలు, బ్యాడ్జీలు, స్టిక్కర్లు, అన్నింటికీ మించి సమావేశాలు, సభలకు రావాలంటే పెద్ద నోటు అప్పజెప్పాల్సిందే. కనీసం రూ.200 నుంచి రూ.400 ముట్టజెపాల్సిందే.. కేడర్‌ను కాపాడుకోవాలి. ఇంధన ఖర్చులతో పాటు భోజనాలు, విందు ఖర్చులు ఇలా రోజుకు రూ.లక్షల్లో ఖర్చు భరించాల్సి ఉంటుంది.. అయితే అభ్యర్థి ఖర్చు రూ.40 లక్షలకు మించకూడదని ఎన్నికల సంఘం నిబంధన ఉంది. అంతేకాకుండా ఎన్నికల ఖర్చుపై ప్రత్యేకంగా ఎన్నికల విభాగం అధికారులు దృష్టి సారించారు.
అభ్యర్థుల ఖర్చుపై ఆందోళన
ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు తమ ఖర్చును రూ.40 లక్షలలోపు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా మద్యం, లిక్కర్ తదితర వస్తువులు పట్టుబడ్డ సమయంలో ఫ్లయింగ్ స్వాడ్ , సర్వేలెన్స్ వీడియో రికార్డ్ తప్పనిసరి చేశారు. రాజకీయ పార్టీల మీటింగ్స్, బ్యానర్లు మొదలైన సామగ్రిపై వీడియో సర్వేలెన్స్ టీమ్‌లు రికార్డు చేస్తారు. ఫ్లయింగ్ స్కాడ్ టీమ్‌లు సీజ్ చేసిన నగదును కోర్టుకు సమర్పించి, ఎఫ్ఐఆర్ నమోదు కాని నగదును జిల్లా గ్రీవెన్స్ సెల్ (డీజీసీ హైదరాబాద్ కలెక్టరేట్)కు సమర్పించనున్నారు.
ఎన్నికల నియమావళి ప్రకారం నగర ప్రజలకు 50 వేలలోపు నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నదని, 50వేలకు పైబడి ఉన్న నగదుకు సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నాయకులు ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ వాహనాలను కూడా చెక్ చేసే అధికారం ఉన్నదని చెప్పారు.
ప్రతి దానికో రేటు