Kondapur | బీఆర్ఎస్ మహిళా ఫ్లెక్సీలను చించిన అధికారులు.. మియాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన
మహిళా దినోత్సవం రోజున మహిళలను అవమానపరిచేలా అధికారుల తీరుందంటూ సోమవారం మియాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మహిళా నేతలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.
కొండాపూర్, మార్చి 9 : మహిళా దినోత్సవం రోజున మహిళలను అవమానపరిచేలా అధికారుల తీరుందంటూ సోమవారం మియాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మహిళా నేతలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. మహిళా దినోత్సవం రోజున శుభాకాంక్షలు తెలుపుతూ వేసుకున్న ఫ్లెక్సీలను తొలగించడం ఏంటంటూ ప్రశ్నించారు. ఒక మహిళా అధికారి మహిళ దినోత్సవాన ఫ్లెక్సీలు తొలగించేలా ఇచ్చిన ఆదేశాల వెనుక ఉన్నది ఎవరంటూ ప్రశ్నించారు.
మిగతా పార్టీల ఫ్లెక్సీలను అలాగే ఉంచి కేవలం బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడం కక్ష సాధింపు చర్యలేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు తమ విధులు తాము నిర్వర్తించాలని, కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నియోజక వర్గంలో అనేక సమస్యలున్నాయని, వాటిపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పోలీసుల ఓవర్ యాక్షన్…ఫ్లెక్సీలా తొలగింపు పై మియాపూర్ సర్కిల్ కార్యాలయం ముందు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్న తమను బలవంతంగా వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేయడమేంటి? ప్రజలకు నిరసనలు తెలిపే హక్కులు కూడా లేవా అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఫ్లెక్సీలు అలాగే ఉంచుతారు, బీఆర్ఎస్ పార్టీవీ తొలగింపు పై అధికారులు సమాధానం చెప్పే వరకు నిరసన విరంపజేసేది లేదంటున్నారు. పోలీసులు అందరిని సమంగా చూడాలని, కాంగ్రెస్ కోసమే పని చేయొద్దని, అధికారం ఎవరి సొంతం కాదు, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ హెచ్చరించారు. నిరసనలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, నాయకులు పారునంది శ్రీకాంత్, రోజా దేవి, నరేందర్ యాదవ్, కార్తీక్, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

