Uppal | విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నగరం కాంగ్రెస్ పాలనలో మసకబారిపోతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం తో చిన్న వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గంటలు గంటలు వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రాత్రి కురిసిన వర్షానికి ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ ఆలస్యం కారణంగా రోడ్లపై భారీగా వరద నిలిచింది.
నీటిని మోటర్లు పెట్టి మరీ ఎత్తిపోయడం నగర పరిస్థితికి అద్దం పట్టింది. 2018 జూలైలో ప్రారంభమైన ఫ్లైఓవర్ పనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా స్థానికులతోపాటు వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరాకు ప్రారంభిస్తామని గొప్పగా ప్రకటించిన కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి పనులు చూస్తే 2027 దసరాకు కూడా ప్రారంభమయ్యేట్టు కూడా కనిపించడం లేదు.
ఉప్పల్ రోడ్లపై ఎత్తిపోతలు
ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ ఆలస్యం కారణంగా రోడ్లపై భారీగా నిలిచిన వరద
మోటార్లు పెట్టి నీరు ఎత్తిపోసిన అధికారులు. నరకయాతన పడిన వాహనదారులు.
2018 జూలైలో ప్రారంభమైన ఫ్లైఓవర్ పనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 8 ఏళ్లుగా స్థానికులతోపాటు… pic.twitter.com/pY4YXiYoBq
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2026