మైలార్‌దేవ్‌పల్లి, మే 31: గుంతలమయంగా మారిన రోడ్లకు ప్యాచ్‌వర్క్ పనులను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు గొంది ప్రవీణ్‌రెడ్డి అన్నారు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122 నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఏర్పడిన గుంతల కారణంగా వాహనాదారులు ఇబ్బందులు పడుతుండడంతో ఆయన అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం బీటీ మిశ్రమంతో గుంతలను పూడ్చారు.
ఈ సందర్భంగా గొంది ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను దృష్టికి పెట్టుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం మరమ్మతు పనులను చేపట్టడం జరిగిందని నూతన రోడ్డును వేసి శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు.