MLA Danam Nagender | ఎమ్మెల్యే అంటే భయమే లేదు.. అధికారులపై దానం నాగేందర్ ఫైర్.. వీడియో
MLA Danam Nagender | ఖైరతాబాద్ డబుల్ బెడ్ రూంల లక్కీ డ్రాలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. అధికారులు ఎమ్మెల్యే దానం రాకముందే లక్కీ డ్రా కార్యక్రమం ప్రారంభించారు. తాను వచ్చే లోపే గృహ లక్ష్మి లక్కీ డ్రా ప్రారంభించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLA Danam Nagender | ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగలేరా..? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటే ఎమ్మెల్యే ఉండి ఎందుకు..? మీ దృష్టిలో ఎమ్మెల్యేకు గౌరవం ఉందా.. లేదా..? మీరే పిలుచుకోండి ప్లాట్లు ఇచ్చుకోండి.. అని ఫైర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులపై అయ్యారు. ఖైరతాబాద్ డబుల్ బెడ్ రూంల లక్కీ డ్రాలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. అధికారులు ఎమ్మెల్యే దానం రాకముందే లక్కీ డ్రా కార్యక్రమం ప్రారంభించారు. తాను వచ్చే లోపే గృహ లక్ష్మి లక్కీ డ్రా ప్రారంభించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టేజ్‌పై నుంచి వెళ్లిపోతున్న దానం నాగేందర్‌ను ఓ అధికారి సార్ ఒక నిమిషం అని అడుగగా.. ఏం మాట్లాడుతున్నవ్.. మీకు సిగ్గుండాలి అసలు.. అధికారులకు మర్యాద లేదు.. అసలు భయం లేకుండా అవుతుంది. ఎమ్మెల్యే అంటే, ప్రొటోకాల్ అంటే భయం లేకుండా అయింది. ఇక్కడ ప్లాట్ల కోసం అప్లై చేసిన వాళ్లు ఎవరైతే ఉన్నరో ఎవరికీ రాకపోయినా నా దగ్గరికి రండి.. అందరికీ ప్లాట్లు రాకపోతే అధికారుల గల్లా పట్టి ఒక్కొక్కరికి ఇల్లు ఇప్పిస్తానంటూ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఎమ్మెల్యే అంటే అధికారులకు గౌరవం లేకుండా పోయింది
అధికారులకు సిగ్గుండాలి.. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగలేరా?
ప్రోటోకాల్ పాటించలేదంటూ ప్రభుత్వ అధికారుల మీద చిందులేసిన దానం నాగేందర్
అప్లై చేసిన అందరికీ ప్లాట్లు రాకపోతే అధికారుల గల్లా పట్టి ఇప్పిస్తా
బంజారాహిల్స్‌లోని కొమురంభీమ్… pic.twitter.com/X7XAyfj5oL
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

