సినీ నటి అనసూయపై అసభ్యకర పోస్ట్‌లు..ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెడుతూ వేధిస్తున్న వారిపై ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెడుతూ వేధిస్తున్న వారిపై ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..గత సంవత్సరం డిసెంబరు 23 నుంచి కొందరు వ్యక్తులు వేర్వేరు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా తన పరువుకు భంగం కలిగించే విధంగా, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్లు నటి అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఒకరు ఏపీలోని కడప జిల్లాకు చెందిన జనార్దన్‌గా గుర్తించారు. నగరంలోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటూ, ఏఐ ద్వారా అనసూయకు సంబంధించిన కల్పిత వీడియోలు సృష్టించి ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా సర్క్యులేట్ చేస్తున్నట్లు గుర్తించారు. మరొక నిందితుడు సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన అరుణ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఇటీవల నటికి సంబంధించిన రీల్‌ను వీక్షించిన నిందితుడు ఆ రీల్‌పై అసభ్యకరమైన కామెంట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

