హైదరాబాద్ : గాంధీ భవన్(Gandhi Bhavan) ముందు రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యూఐ (NSUI) నాయకులు ధర్నా చేపట్టారు. ఆంధ్రా హటావో, తెలంగాణ బచావో అంటూ ప్ల కార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఆంధ్రాకు చెందిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకట్స్వామిని తొలగించి తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంకట స్వామిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్న నాటి నుంచి వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులను ,అధిష్ఠానంకు అనేక సార్లు విన్నవించాం. ఆంధ్ర నాయకుల కింద మళ్లీ పని చేయా ల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. అధ్యక్షుడి పర్యటనకు మాకు కనీస సమాచారం లేదని మండిపడ్డారు. మా సమస్య పరిష్కారం చేసిన తర్వాతే తెలంగాణకు ఎన్ఎస్యూఐ నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి రావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక కేసులు ఎదుర్కున్నాం. ఇప్పుడు మమ్మల్ని దూరం పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
NSUI అధ్యక్షుడు ఎడవెల్లి వెంకటస్వామిని మార్చాలంటూ నిరసనకు దిగిన NSUI కార్యకర్తలు..
NSUI జాతీయ అధ్యక్షుని పర్యటనకు ముందు భగ్గుమన్న వర్గ పోరు.
రేపు తెలంగాణ పర్యటనకు రానున్న NSUI జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి
నిరసనల వెనక ఓ వర్గం నేత హస్తం ఉన్నట్టు పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. pic.twitter.com/MRr39gTauz
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2024