హైదరాబాద్ : నగరంలోని సంజీవయ్య, లుంబిని పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్‌కు వెళ్లే పర్యాటకులకు, వాతావరణ ప్రేమికులకు, సాధారణ పౌరులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ శుభవార్త వినిపించింది. ఈ మూడు పార్కుల్లోకి కెమెరా తీసుకెళ్తే గతంలో అదనంగా రూ. 1000 వసూలు చేసేవారు. ఇప్పుడు కెమెరాలకు, వీడియో కెమెరాలకు ఎలాంటి రుసుం వసూలు చేయడం లేదని, ఈ ప్రతిపాదన నేటి నుంచే అమల్లోకి వస్తుందని హెచ్ఎండీఏ ప్రకటించింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.
Based on public representations, the camera charges of ₹1000 by @HMDA_Gov & Hgcl is henceforth waived off for anyone carrying cameras in Lumbini Park, NTR gardens & Sanjeevaiah park with immediate effect..
— Arvind Kumar (@arvindkumar_ias) October 20, 2021
No need to pay any charges for your camera please pic.twitter.com/9aCMACrAsl