సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్ల కోసం శనివారం హైడ్రా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు వాహనాలతో కూడిన బృందాల కోసం రూ. 20కోట్ల అంచనాతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. స్టాటిక్ టీమ్స్లకు మరో రూ.8కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు అవసరమని అంచనా వేశారు. కాగా ఈ బృందాల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం బలియాకు కాకుండా హైడ్రాకు అప్పగించడంతో వీటిని త్వరగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలైంది. శనివారం సాయంత్రం నుంచి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. మొత్తం 130 టీమ్స్ కోసం టెండర్లు ఆహ్వానిస్తుండగా, మూడ్రోజుల్లో ఫ్రీబిడ్ మీటింగ్ ఏర్పాటు చేసి సంబంధిత ఏజెన్సీలు చేసే పనుల గురించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించనున్నారు. ఆ తర్వాత టెండర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను స్వీకరించి.. తక్కువ కోట్ చేసిన వారికి బాధ్యతలను అప్పగిస్తామని, ఈ ప్రక్రియ మొత్తం వచ్చే గురువారంలోగా పూర్తి చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.