మేడ్చల్, ఏప్రిల్ 15 : ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన స్లాట్‌బుకింగ్ విధానంపై నిరసిస్తూ దస్తావేజు లేఖరులు మంగళవారం ఆందోళన చేశారు. బుధవారం సహాయ నిరాకరణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16 నుంచి 21 వరకు దస్తావేజు పనులు చేయవద్దని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానంలో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.
ఇటు దస్తావేజు లేఖరులు, రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది, అటు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. రిజిస్టేష్రన్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని, పూర్తి స్థాయిలో ఆప్షన్లు లేకుండానే ఆన్లైన్ బుకింగ్ విధానం తీసుకువచ్చారన్నారు. కొత్తగా వచ్చే విధానాలు సరళీకృతంగా ఉండాలని కానీ సమస్యలు తెచ్చి పెట్టేలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయంపై పునరాలోచన చేసి, ఆన్లైన్లో స్లాట్ బుకింగ్‌ను రద్దు చేయాల డిమాండ్ చేశారు.
స్లాట్‌తో వినియోగదారులకే ఇబ్బందులు..
పోచారం, ఏప్రిల్ 15: స్లాట్ విధానాన్ని రద్దు చేయాలంటూ నిరసిస్తూ పోచారం మున్సిపాలిటీ నారపల్లి సబ్‌రిజి స్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యు మెంట్ రైటర్లు మంగళవారం ఆందోళన చేశారు. ఉదయం నుంచే దస్తావేజుల తయారీ పనులను నిలిపివేశారు. ప్రభుత్వం స్లాట్ విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు.
ప్రభుత్వం తీసుకు వస్తు న్న ఈ విధానంతో వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకునే వరకు తమ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లు రంగ నరేందర్ గౌడ్, శ్రీనివాస్, హరికృష్ణ గౌడ్, మధుసూదన్‌రెడ్డి,బాలకృష్ణ,మధుకర్‌రెడ్డి,సురేశ్, వినోద్ కుమార్,శ్రీహిత్శర్మ,బాలు,రవి నా యక్,భాస్కర్, కళ్యాణ్,సైదులు,శ్రీకాంత్, శ్రీ నివాస్ తదితరులు పాల్గొన్నారు.
పాత పద్ధతినే కొనసాగించాలి..
శంషాబా రూరల్, ఏప్రిల్ 15: స్లాట్ బుకింగ్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. పాతపద్ధతినే కొనసాగించాలని కోరుతూ మంగళవారం డాక్యుమెంట్ రైటర్లు శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పద్ధతిలో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండేదని, స్లాట్ బుకింగ్‌తో ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
స్లాట్ బుకింగ్ ద్వారా డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధిపై దెబ్బపడుతుందని అన్నారు. ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగించాలని కోరారు. అనంతరం శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు సుధాకర్, బాల్‌రెడ్డి,హేమంత్‌రెడ్డి, శ్రీనివాస్, రవి, రాజు, శ్రీనివాస్, నరేశ్, కరుణాకర్‌రెడ్డి, హరి, మాజిద్, షరీఫ్, వినయ్‌రెడ్డి, ప్రకాశ్, శ్రీశైలం, భాస్కర్, శ్రీను, సిద్ధు, ప్రవీణ్, వహెద్ తదితరులు పాల్గొన్నారు.