JNIAS | బంజారాహిల్స్, ఏప్రిల్ 25 : క్రీడల వల్ల విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం, ఏకాగ్రత పెరుగుతుందని నార్త్‌జోన్ అడిషినల్ డీసీపీ పి. అశోక్ అన్నారు. బంజారాహిల్స్‌లోని జేఎన్ఐఏఎస్(జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్) ఆర్కిటెక్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కురుక్షేత్ర 2025 ఆటల పోటీలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ .. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను తీసుకురావడంతో పాటు చదువుల్లో కూడా రాణించేందుకు దోహదపడతాయని అన్నారు. జేఎన్ఐఏఎస్ రిజిస్ట్రార్ డాక్టర్ డి.సురేష్ మాట్లాడుతూ ఇది కురుక్షేత్ర 9వ ఎడిషన్ అని ప్రతియేటా క్రీడా పోటీలతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్, జర్నలిజం, డిజైనింగ్, ఫొటోగ్రఫి రంగాల్లో కూడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తున్నామని అన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడాపోటీల్లో తెలంగాణలోని అన్ని ఆర్కిటెక్ కాలేజీల విద్యార్థులు పాల్గొంటారని ఆదివారం రోజు ముగింపు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ట్రోఫీని అడిషినల్ డీసీపీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గోపాలకృష్ణ, సినీ సంగీత దర్శకుడు కె. నిహాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.