కొండాపూర్, అక్టోబర్ 27 : లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన లిఫ్ట్ అప్పుడే మొరాయిస్తుంది. అధికారులను కలిసేందుకు వచ్చే అర్జిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. చందానగర్ సర్కిల్ కార్యాలయంలో రూ.29.80 లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ మున్నాళ్లకే పాడైపోయింది. హైటెక్ రేంజ్ లో ఖర్చు చేసి ఏర్పాటు చేసిన లిఫ్ట్ అప్పుడే పాడవడం ఏంటంటూ జీహెచ్ఎంసీ సిబ్బందే గుసగుసలాడుతున్నారు. సోమవారం ప్రజావాణి కొనసాగుతుండడం, అధిక సంఖ్యలో అర్జీలు పెట్టుకునేందుకు వచ్చిన వారికి ఇబ్బందులు తప్పలేదు. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేస్తే సరిపోదు.. సరైన మెయింటెనెన్స్ కూడా ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.