Inspire Awards | సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్, కేంద్ర విద్యాలయాల పాఠశాలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా తమ పాఠశాలల నుంచి ఐదుగురు విద్యార్థులకు ‘ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ 2024-25’ నామినేషన్స్ చేయాలని జిల్లా విద్యాశాఖధికారిని రోహిణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నామినేషన్ ప్రక్రియపై ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారి ధర్మేందర్ రావు 7799171277, 7981 950513, 6300869388 నంబర్లలో సంప్రదించాలని రోహిణి సూచించారు.