దుండిగల్, సెప్టెంబర్ 26: కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇటీవల ఇంటి పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు , ఒక్కొక్క రిజిస్ట్రేషన్ చేసేందుకు లక్షల్లో ముడుపులు చేతులు మారుతున్నట్లు ‘నమస్తే తెలంగాణ’ ‘పైసలు కొట్టు-రిజిస్ట్రేషన్ పట్టు’ శీర్షికతో శుక్రవారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం ఇంటిపన్ను ఆధారిత రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఇక నుంచి తాము ఇంటిపన్ను రసీదులపై రిజిస్ట్రేషన్లు చేయబోమని ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు సబ్రిజిస్ట్రార్లు స్పష్టం చేశారు.