Nizampet | దుండిగల్, మార్చి 20 : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధించిన అదనపు పన్ను సమస్యను పరిష్కరించాలని 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలను వీరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల ప్రజలు అదనపు ఇంటి పన్ను విధింపుతో మధ్యతరగతి కుటుంబాలు ఆ భారాన్ని చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని డివిజన్ మాజీ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో సమస్యపై వెంటనే స్పందించిన మాజీ కార్పొరేటర్ కాలనీ ప్రజలతో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సాబేర్ అలీని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ సాబేర్ అలీ మాట్లాడుతూ ఇంటి పన్ను సమస్యపై ఇదివరకే కలెక్టర్‌తో చర్చించామని వచ్చే నెల (ఏప్రిల్ )లోపు సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వీరేందర్ రెడ్డితో పాటు కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎం.సి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డితో పాటు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.