హైదరాబాద్: నిమ్స్ (NIMS) దవాఖానలో విధులు నిర్వహించే అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట (Begumpet) బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. డాక్టర్ ప్రాచీకార్ అధిక మోతాదులో అనస్తీషియా తీసుకున్నట్లు తెలుస్తున్నది. గమనించిన కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను నిమ్స్ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆమే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్య..
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) నిలిచిపోయింది. పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీకి ఉన్న చక్రంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రైలును మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. టెక్నికల్ సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరించడంతో రైలు మళ్లీ అక్కడి నుంచి కదలింది. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ గంటపాటు మిర్యాలగూడలోనే ఆగిపోయింది.
కాగా, గతేడాది జూలై 7న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్ద రైలులోని ఎస్4 బోగీలో మంటలు చెలరేగాయి. ఉదయం 10.09 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఏడు బోగీలు దగ్ధమయ్యాయి. ప్రయాణికులు, లోకోపైలట్ అప్రమత్తతతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బోగీల్లో పొగలు, మంటలు వ్యాపించటంతో ఓ ప్రయాణికుడు చైన్ లాగి రైలును ఆపాడు.