రవీంద్రభారతి, ఆగస్టు 18: బహుజన చక్రవరి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా బాలాజీ దూసరి దర్శకత్వంలో రూపొందించిన నీరా (ప్రకృతి పానీయం) డాక్యుమెంటరీని రవీంద్రభారతిలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్రా వెంకటేశం, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పల్లె రవి కుమార్, బాలపాని లక్ష్మీనారాయణ, వివిధ కుల సంఘ నాయకులు, గౌడ కులస్థులు తదితరులు పాల్గొన్నారు.