దుండిగల్, జూలై 12: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బాచుపల్లిలోని నెబులా ఫెసిఫికా కన్స్ట్రక్షన్ టవర్స్ ముందు శనివారం ఫ్లాట్ల కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. గుజరా త్ రాష్ర్టానికి చెందిన నెబులా ఫెసిఫికా కన్స్ట్రక్షన్ సంస్థ యాజమాన్యం తమను మోసగించిందని.. రెరా, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం …
బాచుపల్లిలోని సర్వే నంబర్ 213,214,218 లలో సుమారు తొమ్మిదిన్నర ఎకరాల్లో 2016లో అపార్ట్మెంట్ నిర్మాణాలను నెబులా పెసిఫికా కన్స్ట్రక్షన్ అనే సంస్థ చేపట్టింది. ఫ్రీ లాంచింగ్ పేరుతో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్‌ను 850 ఎస్ఎఫ్టీ చొప్పున ఫ్లాట్లు నిర్మిస్తామని ప్రకటనలు ఇచ్చి, ఎస్ఎఫ్టీ ఒక్కంటికీ రూ. రూ.3,500 చొప్పున తమ నుం చి డబ్బులు వసూలు చేసిందని తెలిపారు. మొదట్లో 4 ఏండ్లలోపు అంటే 2020 వరకూ అన్ని వసతులతో ఇండ్లను పూర్తి చేసి అప్పగిస్తానని హామీ ఇచ్చి..
ఇప్పటి వరకు అప్పగించలేదని, ఇంకా 30 శాతం పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తీడు నిర్మాణ వ్యయం పెరిగిందని ఎస్‌ఎఫ్‌టికి మరో రూ .1000 ల చొప్పున అదనంగా చెల్లించాలని సంస్థ బెదిరిస్తుందని అన్నారు. సుమారు 2000 మంది మధ్యతరగతి ప్రజలు యాజమాన్యం తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. రెరా చట్టాలను ఉల్లంఘిస్తూ నెబులా పసిఫికా బిల్డర్ తమకు ఇండ్లను సకాలంలో అప్పజెప్పకపోవడంతో పాటు అదనపు డబ్బులు డిమాండ్ చేయడం అన్యాయం అని అన్నారు. తమకు జరిగిన అన్యాయంపైన రెరా, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో నెబులా ఫెసిఫికా కన్స్ట్రక్షన్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాం