కీసర, మే 11: తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ మేనమామలా ఉంటూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అందిస్తూ అండగా ఉంటున్నాడని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన కల్యాణలక్ష్మి కింద మంజూరైన 33 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆడపడచులకు అండగా ఉంటున్నాడని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందడంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు.
అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసర మండల తాసీల్దార్ గౌరివత్సల, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, సర్పంచ్‌లు తుంగ ధర్మేందర్, ఆకిటి మహేందర్‌రెడ్డి, మోర విమలనాగరాజు, సుంకరి కవితజైహింద్రెడ్డి, అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ పండుగ కవితశశికాంత్, తటాకం నారాయణశర్మ, మండల సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్‌రెడ్డి, మండలపార్టీ అధ్యక్షులు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, నాయకులు నాయకపు వెంకటేశ్, తటాకం భానుశర్మ, సుజాత, పండుగ శశికాంత్, కీసర ఉపసర్పంచ్ తటాకం లక్ష్మణ్‌శర్మ పాల్గొన్నారు.