నాంపల్లి క్రిమినల్ కోర్ట్, జూలై 28(నమస్తే తెలంగాణ): ఆగస్ట్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ గురించి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్తో మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాధికా జైస్వాల్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కోరారు.
రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించేలా చూడాలన్నారు. లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేస్తామని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేశ్, జనరల్ సెక్రటరీ జస్పాల్ సింగ్ తెలియజేశారు.