సుల్తాన్‌బజార్ : దేశ ప్రధాని హోదాలో ఉండి తెలంగాణ ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం మోజాంజాహి మార్కెట్ చౌరస్తాలో గోషామహల్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, సీనియర్ నాయ కులు ఎం ఆనంద్‌కుమార్ గౌడ్లు ప్రధాన మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో గన్‌ఫౌండ్రీ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా, టీఆర్ఎస్ నాయకులు శంకర్ లాల్ యాదవ్, రమేష్ గుప్తా, సునీల్ సా, సుధీర్ శ్రీవాత్సవ్, ఆర్ఏ వినోద్‌కుమార్, శ్రీనివాస్ యాదవ్, జై శంకర్, శీలం సరస్వతి, సలీం, తాహేర్, అస్లాం, ఫహీం,సల్మాన్, హరి,శేఖర్,ఉమ,నవీన్, మహేష్ గౌ డ్,నందు కుమార్‌లు తదితరులు పాల్గొన్నారు.
అలాగే గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర విభజనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ డిప్యూటీ మేయర్ బాబాఫసియొద్దీన్, టీఆర్ ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరి శ్రీకాంత్‌గౌడ్‌లు దేశ ప్రధాని నరేంద్రమోఢీ దిష్టిబొమ్మను దహనం చేశారు.