హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి నార్కోటిక్ పోలీసులు(Narcotics police) తగు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తాజాగా తెచ్చిన డ్రగ్స్ డిటెక్టివ్(Drug detective) పరికరాలతో అనుమానితులకు(Drugs suspects) నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. 40 మంది అనుమానితులకు మాదక ద్రవ్యాల నిర్ధారణ పరీక్ష నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొన్న మాదాపూర్ పోలీసులు వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు తరలించారు. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, రవాణా చేసిన చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.