సిటీబ్యూరో, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో స్టేట్ టాప్ ర్యాంకులను సాధించారు. ఇంటర్ బోర్డు చరిత్రలోనే అత్యుత్తమ మార్కులతో మూడోసారి నారాయణ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 469 మార్కులతో కే సాయిగౌతమ్, జీ వరేణ్య సంయుక్తంగా స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించారు. బైపీసీలో 14 మంది విద్యార్థులు 438 మార్కులతో టాప్ ర్యాప్ ర్యాంకులో నిలిచారు.
సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఐదుగురు విద్యార్థులు ఎంపీసీలో 996మార్కులతో టాప్లో నిలిచారు. బైపీసీలో ముగ్గురు విద్యార్థులు 994 మార్కులతో స్టేట్ టాప్ మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 183 మంది విద్యార్థులు 468 మార్కులు, 470 మంది విద్యార్థులు 467 మార్కులు, 667 మంది విద్యార్థులు 466 మార్కులు, 694 మంది విద్యార్థులు 465 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 10మంది విద్యార్థులు 995 మార్కులు, 29 మంది 994 మార్కులు సాధించారు.
వీటితో పాటు ఎంపీసీ, బైపీసీల్లో అనేక మంది రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి మరోసారి నారాయణ సత్తాచాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డా.పీ సింధూర నారాయణ, శరణి నారాయణ, రమా నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రమా నారాయణ మాట్లాడుతూ.. జూనియర్ ఇంటర్లో ఆల్టైమ్ హయ్యస్ట్ మార్కులు వరుసగా మూడు సంవత్సరాల నుంచి నారాయణ విద్యార్థులు సాధిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. 47 ఏళ్లుగా నారాయణ సాగిస్తున్న విజయయాత్ర కొనసాగింపుగా ఇంటర్ ఫలితాలు నిలిచాయని డా.సింధూర నారాయణపేర్కొన్నారు.