నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఫెస్టివల్ మేళాకు తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి వెలిగించి మేళాను ప్రారంభించారు. అనంతరం, ఆయన ప్రసంగిస్తూ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని ప్రజలు కొనుగోళ్ళు చేసేందుకు గాను ఎగ్జిబిషన్ సొసైటీ ఫెస్టివల్ మేళాను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వినయ్ కుమార్, సెక్రెటరి డాక్టర్ బి.ప్రభా శంకర్లు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ వరకు మేళా కొనసాగుతుందని ప్రతిరోజు సాయంత్రం నాల్గు గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు వస్తు ప్రదర్శనతో పాటు అమ్మకాలు కొనసాగుతుయన్నారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరి జానకి రామ్, కోశాధికారి హన్మంత్ రావు పాల్గొన్నారు. – అబిడ్స్, అక్టోబర్ 11