తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే సీతాపయనం
‘ముందు ఈ కథ రెడీ చేసుకున్నప్పుడు హీరోగా విశ్వక్సేన్ అనుకున్నాం. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. అయితే.. కథలో ఒక్క సీన్ కూడా మార్చలేదు. ఆ ప్లేస్‌లో నిరంజన్ వచ్చాడు.
‘ముందు ఈ కథ రెడీ చేసుకున్నప్పుడు హీరోగా విశ్వక్సేన్ అనుకున్నాం. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. అయితే.. కథలో ఒక్క సీన్ కూడా మార్చలేదు. ఆ ప్లేస్‌లో నిరంజన్ వచ్చాడు. జీవితం ఓ సర్కిల్ లాంటిది. ఇక్కడ కక్ష సాధింపులేం ఉండవ్. మళ్లీ సెట్ అయితే.. విశ్వక్‌తో కలిసి పనిచేయడానికి నాకేం అభ్యంతరం లేదు’ అని అగ్ర నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా అన్నారు.
ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సీతాపయనం’. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఈ సినిమా ద్వారా కథానాయికగా పరిచయం అవుతున్నది. నిరంజన్ కథానాయకుడు. ప్రేమికులురోజు కానుకగా ఈ నెల 14న(రేపు) సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం అర్జున్ విలేకరులతో ముచ్చటించారు.
‘ఆడపిల్లలను కూడా అభిరుచులకు తగ్గట్టు పేరెంట్స్ ప్రోత్సహించాలి. నా కుమార్తె ఐశ్వర్యకు నటన పట్ల ఆసక్తి ఉంది. అందుకే తనను సినిమాల్లోకి తెచ్చాను. ఇది యూనివర్సల్ కాన్సెప్. ఏ భాషలో తీసినా అందరికీ కనెక్టయ్యే ఫీల్‌గుడ్ సబ్జెక్ట్. అందుకే నాలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఇందులో కేవలం ప్రేమే కాదు, అన్ని రకాల ఎమోషన్సూ ఉంటాయి.
కుటుంబాన్ని ప్రేమించడం కూడా దేశభక్తే అవుతుందని తెలిపే సినిమా ఇది’ అని అర్జున్ చెప్పారు. ఇందులో పాటలు, పాత్రలు, ఫైట్స్ అన్నీ కథలో భాగంగానే ఉంటాయని, అభినయానికి ఆస్కారమున్న పాత్రల్ని ఐశ్వర్య, నిరంజన్ పోషించారని, తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించే సినిమా ఇదని, సెన్సార్‌వారు ఈ సినిమాచూసి భావోద్వేగానికి లోనయ్యారని అర్జున్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

