సండే సందడిగా.. దసరా షాపింగ్ బొనాంజా
దసరాకు షాపింగ్ చేయాలనుకునే వారు త్వరపడండి.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా సందడిగా సాగుతున్నది. నగరంలో వివిధ భాగస్వాముల ఔట్లెట్లలో ఈ షాపింగ్ బొనాంజా ఈనెల 18వ తేదీ వరకు కొనసాగనున్నది. ఎంపిక చేసిన ఔట్లెట్లలో ప్రతిరోజు లక్కీ డ్రా తీసే కార్యక్రమం కొనసాగుతున్నది. ఆదివారం అమీర్‌పేట్ చందనా బ్రదర్స్ షోరూమ్‌లో ఆద్యంతం సందడిగా జరిగిన 6వ రోజు డ్రా కార్యక్రమంలో ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు.
- ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్యర్యంలో లక్కీ డ్రా విజేతలు పేర్లు విడుదల
అమీర్‌పేట్, అక్టోబర్ 15 : దసరాకు షాపింగ్ చేయాలనుకునే వారు త్వరపడండి.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా సందడిగా సాగుతున్నది. నగరంలో వివిధ భాగస్వాముల ఔట్లెట్లలో ఈ షాపింగ్ బొనాంజా ఈనెల 18వ తేదీ వరకు కొనసాగనున్నది. ఎంపిక చేసిన ఔట్లెట్లలో ప్రతిరోజు లక్కీ డ్రా తీసే కార్యక్రమం కొనసాగుతున్నది. ఆదివారం అమీర్‌పేట్ చందనా బ్రదర్స్ షోరూమ్‌లో ఆద్యంతం సందడిగా జరిగిన 6వ రోజు డ్రా కార్యక్రమంలో ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో చందనా బ్రదర్స్ సిటీ హెడ్ అనిల్ పాల్గొని మొదటి డ్రా తీయగా, జీఆర్ 2 యాడ్స్ అధినేత జి.రాజేశ్వర్, చందనా బ్రదర్స్ అమీర్‌పేట్ స్టోర్ హెడ్ సతీశ్, నమస్తే తెలంగాణ ఏజీఎంలు మిగిలిన డ్రాలు తీశారు.
విజేతలు వీరే…
ఆదివారం నాటి డ్రాలో విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటి బహుమతిని బి.జయంత్‌రెడ్డి, 2వ బహుమతిని వి.ఆంజనేయులు, 3వ బహుమతిని లక్ష్మీనివాస్, 4వ బహుమతిని సంతోష్, 5వ బహుమతిని శైలజ దక్కించుకున్నారు. ఈ నెల 20న నగరంలో జరిగే ఈవెంట్లో బంపర్ బహుమతిగా నిస్సాన్ మాగ్నెట్ కారును దక్కించుకునే విజేతను ఎంపిక చేయడం జరుగుతుంది.
లక్కీడ్రాను సద్వినియోగం చేసుకోండి
దసరా షాపింగ్ చేస్తూనే లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవాలనుకుంటున్న కస్టమర్లు ప్రతిరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో నగరంలోని ఔట్లెట్లకు సంబంధించిన వివరాలు ఉంటున్నాయి. ఈనెల 18వ తేదీతో దసరా షాపింగ్ బొనాంజా ముగుస్తున్నందున కస్టమర్లు మిగిలిన నాలుగు రోజుల్లో షాపింగ్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంపిక చేసిన ఔట్లెట్లలో జరిగే షాపింగ్‌లో కస్టమర్లకు నమస్తే తెలంగాణ కూపన్లు అందివ్వడం జరుగుతుంది. వాటిని కస్టమర్లు తమ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ రాసి అక్కడే డ్రాప్ బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. నగర వినియోగదారులు ఎంతో ఉత్సాహంగా ఈ డ్రాలో పాల్గొంటుండటం అభినందనీయం.. – సింగీతం రామకృష్ణ, ఏజీఎం, నమస్తే తెలంగాణ
ఆసక్తి చూపుతున్న కస్టమర్లు..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా కోసం కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షాపింగ్ సమయంలో ఆయా మాల్స్ ఇస్తుండే రాయితీలే కాకుండా లక్కీ డ్రా నిర్వహిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేల దసరా షాపింగ్ బొనాంజాలో కూడా లక్కీ డ్రాలో కూడా బహుమతులు పొందే వీలుండటంతో నగరంలో ఎంపిక చేసిన ఔట్లెట్లలో కస్టమర్లు షాపింగ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
– జి.రాజేశ్వర్, జీఆర్ 2 యాడ్స్ అధినేత
ఉత్సాహంగా పాల్గొంటున్నారు..
దసరా షాపింగ్ బొనాంజా కూపన్లను కస్టమర్లు అడిగి తీసుకుంటున్నారు. ప్రతియేటా చందనా బ్రదర్స్‌లో షాపింగ్ చేసే కస్టమర్లతోపాటు కొత్త కస్టమర్లు కూడా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే షాపింగ్ బొనాంజా కూపన్లు అడిగి తీసుకుంటున్నారు. గత కొన్నేండ్లుగా చందనా బ్రదర్స్ షాపింగ్ సెంటర్లలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే షాపింగ్ బొనాంజాలో ప్రతిరోజు ఐదు బహుమతులతోపాటు బంపర్ బహుమతిని కూడా గెల్చుకునే అవకాశాలు ఉండటంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
– సతీశ్, చందనా బ్రదర్స్ అమీర్‌పేట్, మేనేజర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

