నాలుగోరోజూ లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. ఇంధన ధరలు మరింత తగ్గుతుండటంతోపాటు విదేశీ మదుపర్లు భారీగా పెట్టుబడులు పెట్టడంతో మంగళవారం సూచీలు రెండు శాతం వరకు లాభపడ్డాయి.
ముంబై, నవంబర్ 3 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. ఇంధన ధరలు మరింత తగ్గుతుండటంతోపాటు విదేశీ మదుపర్లు భారీగా పెట్టుబడులు పెట్టడంతో మంగళవారం సూచీలు రెండు శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 1,225 పాయింట్లు లేదా 1.62 శాతం బలపడి 76,917.85 పాయింట్ల వద్ద ముగియగా, మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 370 పాయింట్లు లేదా 1.58 శాతం అందుకొని 23,810.85 వద్ద స్థిరపడింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య చర్చలు జరుగుతుండటంతో గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 105 డాలర్ల దిగువకు పడిపోవడం మదుపర్లలో జోష్ పెంచిందని, ఫలితంగా సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఎఫ్ఐఐలు కూడా భారీగా నిధులు కుమ్మరించడం కూడా కలిసొచ్చిందన్నారు. సూచీల్లో హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. కానీ, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టాటాస్టీల్, ట్రెంట్ షేర్లు పతనం చెందాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఒక్క శాతం వరకు బలపడ్డాయి. రంగాలవారీగా ఎఫ్ఎంసీజీ సూచీ అత్యధికంగా 3.38 శాతం బలపడగా, రియల్టీ 2.33 శాతం, టాప్-10 బ్యాంకింగ్ 1.92 శాతం, ఆర్థిక సేవలు 1.67 శాతం, ఆటో 1.64 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.30 శాతం చొప్పున పెరిగాయి. యుటిలిటీ, పవర్ రంగ షేర్లు పతనం చెందాయి. 2,510 షేర్లు లాభాల్లో ముగియగా..1,895 షేర్లు పతనం చెందాయి. వరుసగా నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 3,671.82 పాయింట్లు లేదా 5 శాతం, నిఫ్టీ 1,112 పాయింట్లు లేదా 4.89 శాతం చొప్పున పెరిగాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

