తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ మొత్తం మోకాళ్లపై తిరిగినా ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాదని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ఈటీ నరసింహ స్పష్టంచేశారు.
- సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ స్పష్టీకరణ
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ మొత్తం మోకాళ్లపై తిరిగినా ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాదని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ఈటీ నరసింహ స్పష్టంచేశారు. దేశంలో మూడు కోట్ల మంది చొరబాటుదారుల ఓట్లను తొలగించామని అమిత్ షా వ్యాఖ్యానించడం ఆయన అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.
గత 12 ఏండ్లుగా హోంమంత్రిగా ఉన్న అమిత్షా ఇంతమంది చోరబాటుదార్లు దేశంలోకి ప్రవేశిస్తుంటే ఏం చేస్తున్నారని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎస్ ఛాయాదేవి, జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వారందరినీ విదేశీయులుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

