మెహిదీపట్నం, అక్టోబర్ 8: ఇంటి వంటకాలతో దసరా పండుగ సంబురాలు నిర్వహించుకోవడానికి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా పండుగ షాపింగ్ బొనాంజా పేరుతో లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు. దశాబ్ద కాలంగా ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా నిర్వహించే లక్కీ డ్రాను మంగళవారం సాయంత్రం మెహిదీపట్నం నానల్నగర్లో ఉన్న షీరో ఇంటి వంటకాల కేంద్రంలో నిర్వహించారు.
లక్కీ డ్రాలో ముగ్గురు విజేతలను ప్రకటించారు. నమస్తే తెలంగాణ అడ్వర్టయిజ్మెంట్ ఏజీఎం రాములు, షీరో సంస్థ కోఆర్డినేటర్ విజయ్ వర్మ, షీరో సంస్థ అధీకృతదారులు సువర్ణాదేవి, యాడ్స్ డిప్యూటీ మేనేజర్ షానవాజ్లతో కలిసి డ్రా తీశారు. మొదటి బహుమతి ఎస్కే షాహీర్ (కూపన్ నెం 028931), రెండో బహుమతి రాజు ( కూపన్ నెం 029650) షీరో వినియోగదారులకు రాగా, మూడో బహుమతి చర్మాస్లో షాపింగ్ చేసిన ఫయాజ్( కూపన్ నెం 005295) విజేతలుగా నిలిచారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణటుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ డ్రాలో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, బిగ్ సీ, ఆల్మండ్ హౌస్ భాగస్వామ్యం అందిస్తుండగా ప్రచార కర్తగా టీ న్యూస్, డిజిటల్ ప్రచార కర్తగా సుమన్ టీవీలు వ్యవహరిస్తున్నాయి. బొనాంజాలో ఏడో డ్రాను షీరో కేంద్రంలో నమస్తే తెలంగాణ అడ్వర్టయిజ్మెంట్ ఏజీఎం రాములు పర్యవేక్షణలో నిర్వహించారు.
ఈ నెల 9 వరకు కొనసాగనున్న దసరా బొనాంజాను గ్రేటర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏజీఎం రాములు సూచించారు. షాపింగ్ బొనాంజా ప్రకటనలు చూసి ఎంపిక చేసిన ఔట్లెట్లలో షాపింగ్ చేసి గిఫ్ట్ గెలుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో షీరో సంస్థ కోఆర్డినేటర్ విజయ్ వర్మ, సభ్యురాలు సువర్ణాదేవి, ఏడీవీటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
డ్రాలో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలి
దసరా పండుగ సందర్భంగా బొనాంజా లక్కీ డ్రా ద్వారా అందించడం సంతోషంగా ఉంది. షీరో వంటకాలతో కలిసి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేలు మొదటి సారి ఇక్కడ డ్రాను నిర్వహించడం ఎప్పటికీ మరచి పోలేము. ఇలాంటి లక్కీ డ్రా కార్యక్రమం వినియోగదారులకు సంబురాలను తెస్తుంది. డ్రాలో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలి. పండుగకు మా కస్టమర్లకు బహుమతులు రావడం అదృష్టంగా భావిస్తున్నా.
– విజయ్ వర్మ, షీరో సంస్థ కోఆర్డినేటర్
సంతోషంగా ఉంది
నమస్తే తెలంగాణ,తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బొనాంజా లక్కీ డ్రాలో పాల్గొనడం సంతోషంగా ఉంది. లక్కీ డ్రాను నిర్వహించడం అభినందనీయం. ప్రతి సంవత్సరం నిర్వహించే లక్కీడ్రా ద్వారా కొనుగోలుదారులకు దసరా పండుగను ముందే తీసుకువస్తుంది. స్పాన్సర్ల వద్దకు వచ్చి పారదర్శకంగా నిర్వహించడం అభినందనీయం. నమస్తే తెలంగాణ వారి బహుమతులతో స్పాన్సర్లకు కూడా అదనపు అమ్మకాలు జరుగుతున్నాయి. నమస్తే తెలంగాణ,తెలంగాణ టుడే ప్రతి సంవత్సరం లక్కీడ్రా నిర్వహించాలని కోరుకుంటున్నా.
-రాజేశ్వర్, జీఆర్2 అడ్వర్టయిజర్