Namaste Telangana | అమీర్‌పేట్, అక్టోబర్ 6: దసరా పండుగ సీజన్ కావడంతో అటు షాపింగ్ సెంటర్లు ఇస్తుండే రిబేట్లు ఒక వైపు, ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల సమర్పణలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజాలో ప్రతి రోజు గెలుచుకుంటున్న లక్కీ డ్రా ద్వారా అందివస్తున్న బహుమతులు కొనుగోలుదారులకు డబుల్ ధమాకాగా మారాయి.
ఎంపిక చేసిన ఔట్లెట్లలో షాపింగ్ చేస్తున్న కొనుగోలుదారులు తమకు అందిన కూపన్లు డ్రాప్ బాక్సుల్లో వేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల సమర్పణలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజా ఐదో లక్కీ డ్రా ఆదివారం అమీర్‌పేట్‌లోని కేఎల్ఎమ్ ఫ్యాషన్ మాల్లో కస్టమర్ల సమక్షంలో ఉత్సాహంగా సాగింది. ఈ లక్కీ డ్రాను కేఎల్ఎమ్ ఫ్యాషన్ మాల్ సోర్సింగ్ ఇన్ఛార్జ్ వి.మహేష్ బాబు, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం ఏజీఎం పి.రాములు, డిప్యూటీ మేనేజర్ సందీప్ జోషిలు నిర్వహించారు.
అమీర్‌పేట్ కేఎల్ఎమ్ ఫ్యాషన్ మాల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఛర్మాస్లో షాపింగ్ చేసిన కె.కవిత మొదటి బహుమతిగా టీవీని గెలుచుకోగా, ద్వితీయ బహుమతిగా స్మార్ట్ ఫోన్‌ను అమీర్‌పేట్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్లో షాపింగ్ చేసిన జె.రాజు, మూడో బహుమతిగా గిఫ్ట్ వోచర్‌ను ఛర్మాస్లో షాపింగ్ చేసిన సలోని గెలుచుకున్నారు. లక్కీ డ్రాలో బహుమతులు గెలుపొందిన విజేతలకు త్వరలోనే వారికి వచ్చిన గిఫ్ట్‌లను అందజేయడం జరుగుతుంది.
పదేళ్లుగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల సమర్పణలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజాలో కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమవుతోంది. తొమ్మిది రోజుల పాటు కొనసాగే లక్కీ డ్రాలో ఆదివారం ఐదో రోజు డ్రా తీశారు. పాఠకులే కాక కొనుగోలుదారులు కూడా లక్కీ డ్రా పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. పండుగ రోజుల్లో ప్రతి రోజు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికలు సమర్పిస్తున్న దసరా బొనాంజా అందిస్తున్న బహుమతులు గెలుచుకుంటున్న విజేతలకు శుభాకాంక్షలు. అత్యంత పారదర్శకంగా ప్రకటనలదారుల వద్ద డ్రాను నిర్వహిస్తున్నాం.
– పి.రాములు, ఏజీఎం, ప్రకటనల విభాగం, నమస్తే తెలంగాణ
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికలు సమర్పిస్తున్న దసరా బొనాంజాలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది. నగరంలో ఉన్న అన్ని ఔట్లెట్లతో పాటు కేఎల్ఎమ్ ఫ్యాషన్ మాల్‌కు చెందిన అన్ని ఔట్లెట్లలో లక్కీ డ్రాలో పాల్గొంటున్న కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేఎల్ఎమ్లో కొనుగోలు చేస్తున్న కొనుగోలుదారులు నేరుగా తాము అందిస్తున్న రిబేట్లే కాకుండా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దిన పత్రికల ద్వారా అందుతున్న బహుమతులు కొనుగోలుదారులకు పండుగ ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది.
– వి.మహేష్ బాబు, సోర్సింగ్ ఇన్ఛార్జ్, కేఎల్ఎమ్ ఫ్యాషన్ మాల్ అమీర్‌పేట్