బంజారాహిల్స్, అక్టోబర్ 6 : విజయదశమి సందర్భంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజా ఐదోరోజు బుధవారం కోలాహలంగా జరిగింది. బంజారాహిల్స్ రోడ్‌నం.3లోని ఫ్రీడం హెల్తీ ఆయిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫ్రీడం హెల్తీ ఆయిల్ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డిలు బొనాంజా లక్కీడ్రా తీయగా..చింతల్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో కొనుగోలు చేసిన కానిస్టేబుల్ మణి రత్నకుమారి 32 ఇంచుల ఎల్ఈడీ టీవీని గెలుచుకున్నారు. కున్ యునైటెడ్‌లో కొనుగోలు చేసిన బొజ్జా రంగయ్యకు రెండో బహుమతిగా రెడ్మీ నోట్ప్రొ-10 మొబైల్, మూడో బహుమతిని కేఎల్ఎం ఫ్యాషన్ షాపింగ్ ద్వారా పొందిన రూ.5వేల గిఫ్ట్ ఓచర్‌తో ఫ్రీడం ఆయిల్ కొనుగోలు చేసిన శారదానగర్‌కు చెందిన శ్రీనివాస స్టోర్స్ యజమాని శ్రీకాంత్ గెలుచుకున్నారు. వీరితోపాటు నిలోఫర్ కేఫ్ నుంచి రెండు గిఫ్ట్ హ్యాంపర్లను ఈ.విజయలక్ష్మి, శ్రీరామ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రీడం సంస్థ డీజీఎం చేతన్, నమస్తే తెలంగాణ యాడ్స్ జీఎం సురేందర్‌రావు, ఏజీఎం రాజిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.
నగరంలో ఎంపిక చేసిన ఔట్లెట్లు, సంస్థలలో కొనుగోలు చేసిన వారిలో ఉత్సాహం నింపేందుకే దసరా బొనాంజా నిర్వహిస్తున్నాం. ఈనెల 10 వరకు కొనసాగే బొనాంజాలో ఫ్రీడం హెల్త్ కుకింగ్ ఆయిల్, కేఎల్ఎం షాపింగ్ మాల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. సెలెక్ట్ మొబైల్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ ప్రధాన సహకారం అందిస్తుండగా, నిలోఫర్ కేఫ్ పవర్డ్ బై స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. ప్రతిరోజూ ఐదుగురికి లక్కీడ్రా ద్వారా బహుమతులు అందజేస్తున్నాం. -శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్
కరోనా కారణంగా రెండేండ్లు పండుగలు చప్పగా సాగాయి. కరోనా తగ్గుముఖంతో పండుగ ఆనందం తిరిగి వచ్చింది. నమస్తేతెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో 8 ఏండ్లుగా దసరా బొనాంజా నిర్వహిస్తున్నారు. తమ సంస్థ మొదటినుంచి ఈ బొనాంజాలో భాగస్వామిగా ఉంటూ ఈ ఏడాది కూడా టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాం. -చంద్రశేఖర్‌రెడ్డి, ఫ్రీడం హెల్తీ ఆయిల్ సేల్స్ అండ్
మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్
చింతల్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయగా సుమారు రూ.3 వేల బిల్లు అయ్యింది. బిల్లుతోపాటు కూపన్లు ఇచ్చారు. డైలీ లక్కీడ్రాలో మొదటి బహుమతిగా ఎల్ఈడీ టీవీ వచ్చిందని నమస్తే తెలంగాణ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పగా మస్తు సంతోషం కలిగింది. ‘నమస్తే తెలంగాణ’ ద్వారా బహుమతి అందుకోవడం ఆనందంగా ఉంది. -పి.మణిరత్నకుమారి, కానిస్టేబుల్, ఎల్ఈడీ టీవీ విజేత
ఫ్రీడంతో ఆనందమేనని నిరూపితమైంది. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దసరా బొనాంజాలో బహుమతి రావడం చాలా లక్కీగా ఫీలయ్యాను. మూడో బహుమతి వచ్చింది. నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే యాజమాన్యానికి కృతజ్ఞతలు. -శ్రీకాంత్, శ్రీనివాసస్టోర్స్, శారదానగర్