ఖైరతాబాద్, సెప్టెంబర్ 22 : ఆనంద్‌నగర్ కాలనీలోని విశ్వేశ్వరయ్య భవన్ రోడ్డులో ఉన్న నాలా రిటైనింగ్ వాల్ కూలిపోయింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి నాలాలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. నాలాలో చుట్టు పక్కల వారు పెద్ద ఎత్తున వ్యర్థాలు వేయడంతో నీరుపోయే దారి లేక బ్యాక్ వాటర్ బలంగా రావడంతో వాల్ కూలిపోయింది.
దీంతో దానికి ఆనుకొని పార్కింగ్ చేసిన వాహనాలు నీటిలో పడిపోయాయి. నాలాల్లో వ్యర్థాలు వేస్తున్నా.. జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే నీరు ముందుకు వెళ్లకుండా వరద ఉధృతితో రిటైనింగ్ వాల్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.