Book launch : హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో నమిలికొండ నాగేశ్వర్ రావు రాసిన ‘నాగన్న పదాలు – కవితా సంపుటి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కవుల సంఘం అధ్యక్షుడు సుతారపు వెంకటనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య విచ్చేశారు.
పుస్తకావిష్కరణ చేసిన అనంరతం ఆయన మాట్లాడుతూ.. నాగేశ్వరరావు రచించిన ‘నాగన్న పదాలు’ పుస్తకంలో సామాజికంగా ఎన్నో విషయాలను ఆవిష్కరించారని, ఇవి సమాజ హితం కోసం ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయని అన్నారు. భారతీయ, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అనేక విషయాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు.
కార్యక్రమంలో తెలంగాణ కవుల సంఘ కోశాధికారి దొంతర బోయిన దైవదీనం, సంఘం కార్యవర్గ సభ్యులు మిద్దె సురేష్, సంపంగి నర్సింహ్మ, బీసీ సంఘం నాయకులు నిరంజన్, బాలయ్య, బెక్కంటి గణేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.