ఎల్బీనగర్ : వరదకాలువల నిర్మాణం విషయంలో కాలనీల వాసులకు అపోహలు అవసరం లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం వరదనీటి ముంపు ప్రాంతాల్లో వేయనున్న వరదకాలువ బాక్స్ డ్రెయిన్ పనులపై లింగోజిగూడ డివిజన్లోని తపోవన్ కాలనీవాసులు మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ తనను నమ్మాలని, కాలనీల్లో బాక్స్ డ్రెయిన్ నిర్మాణం చేయించి వరదనీటి ముంపు లేకుండా చేస్తామన్నారు. సమగ్ర నాలా డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పక్క ప్రణాళికతో వరదకాలువల నిర్మాణం చేస్తున్నామన్నారు.
కాలనీవాసులు వరదనీటి కాలువ పనులకు సహాకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ సురేందర్‌రెడ్డి, ఈఈ రమేష్‌బాబు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వరప్రసాద్‌రెడ్డి, కాలనీవాసులు రావల్కోల్ ప్రకాష్, ఇంద్రాజీ, రవి, క్రాంతి, నరేందర్‌రెడ్డి, కృష్ణ, ఐలయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.