మారిన నియోజకవర్గం దేవాలయంలో పూజలు
ర్యాలీగా బయలుదేరివెళ్లి నామినేషన్
ముషీరాబాద్, నవంబర్ 9: ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్ పార్టీ శ్రేణులు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ నీరాజనం ఫలికారు. అంతకుముందు ఆయన ముషీరాబాద్ మహంకాళీ దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ పరిశీలకుడు ఎక్కాల కన్నా, ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మతోపాటు ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్, అశోక్‌నగర్‌ల మీదుగా వేలాది మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీగా ఇందిరాపార్కు వరకు ఊరేగింపు నిర్వహించారు.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ముషీరాబాద్ నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి అశీర్వదించి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపించినైట్లెతే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం ముషీరాబాద్ నియోజక వర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఠా గోపాల్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ముషీరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వి. లక్ష్మీనారాయణకు తన నామినేషన్‌ను దాఖలు చేశారు.
అనంతరం కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు యావత్ దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని అన్నారు. గత 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ముషీరాబాద్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసింది శూన్యమని అన్నారు. నియోజక వర్గంలోని ఏ బస్తీ, కాలనీకి వెళ్లినా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేస్తున్నారని, ఇప్పటి వరకు నియోజక వర్గంలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు లబ్ధిదారులకు సంక్షే మ ఫలాలు అందజేశామని అన్నారు. అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.