మెహిదీప ట్నం ఆగస్టు 25: వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జ రిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ వారాసిగూడలో సయ్యద్ సజ్జాద్(25) దంపతులు నివాసముంటున్నారు. సజ్జాద్ కొరియర్ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కారు డ్రైవర్‌గా పనిచేసే మెహిదీపట్నం గుడిమల్కాపూర్ సాయినగర్ కాలనీకి చెందిన సయ్యద్ ఎజాజ్(35) సజ్జాద్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడిన సజ్జాద్.. కత్తితో ఎజాజ్‌పై దాడి చేసి హతమార్చాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.