చార్మినార్, ఆగస్ట్ 23 : అప్పు చెల్లిస్తామని పిలిచి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సం ఘటన కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుదర్శన్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మర్వాడీ ప్రాంతానికి చెందిన స్క్రాప్ వ్యాపారి సాధిక్ (40) స్థానికంగా నివసించే అహ్మద్ స్నేహితులు. సాధిక్ కొన్ని నెలల కిందట అహ్మద్‌కు రూ.8లక్షలు అప్పుగా ఇచ్చాడు. అప్పును తిరిగి చెల్లించాలని ఇటీవల సాధిక్ కోరాడు. ఆదివారం రాత్రి తన ఇంటికి వస్తే అప్పు విషయమై మాట్లాడుకుందామని అహ్మద్ చెప్పా డు. ఈ మేరకు సాధిక్ అతడి ఇంటికి వెళ్లగా అప్పటికే మరో ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నా రు. అప్పు విషయమై మాట్లాడుకుంటుండగా నలుగురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆ వేశానికి లోనైన అహ్మ ద్ కత్తితో సాధిక్‌పై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు ఇంటికి తాళం వేసి పారిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు ప్రారంభించామని ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలిపారు.