మాదన్నపేట, ఆగస్టు 25: రియాసత్‌నగర్‌కు చెందిన అక్బర్, ఈసా స్నేహితులు. కొద్ది రోజులుగా అక్బర్ పెండ్లయిన ఓ అమ్మాయిని ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. విషయం ఆమె భర్తకు తెలియడంతో అతడు తన భార్య వెంట పడవద్దని అక్బర్‌తో చెప్పాలని ఈసాను కోరాడు. వివాహం జరిగిన అమ్మాయితో ప్రేమ ఎందుకు అని చెప్పడంతో ఈసాపై అక్బర్ కత్తితో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, గాయపడిన ఈసాను చికిత్స కోసం దవాఖానకు తరలించినట్లు సంతోష్‌నగర్ ఎస్ఐ రవీందర్ తెలిపారు. అక్బర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.