మేడ్చల్, జూన్ 6 : మేడ్చల్‌లో అపరిశుభ్ర వాతావరణంలో విక్రయాలు జరుపుతున్న చికెన్ సెంటర్లను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. శుక్రవారం కమిషనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో చికెన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు.
అపరిశుభ్ర వాతావరణంలో చికెన్‌ను విక్రయిస్తూ ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న రెండు చికెన్ సెంటర్లను గుర్తించారు. రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న సుగుణ, అక్బర్ చికెన్ సెంటర్లను సీజ్ చేశారు. బస్టాండ్‌కు ఎదురుగా ఎస్ఎఫ్సీ పాస్ట్ ఫుడ్ సెంటర్లో పాడైన గుడ్లు, ఆహార పదార్థాలను వంటకాల తయారీ వినియోగిస్తున్నట్టు గుర్తించి, సీజ్ చేశారు.