హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ (Moinabad) అర్ధరాత్రి అసభ్యకర పార్టీ ఘటన వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ (Mujra Party) నిర్వహిస్తున్నారని, అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్సులు వేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్వోటీ పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న ఏడుగురు యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ముజ్రా పార్టీ కోసం యువతులను ఢిల్లీ నుంచి తీసుకొచ్చారని చెప్పారు. అసభ్య నృత్యాలు, అర్ధనగ్న డ్యాన్సులు చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించామని వెల్లడించారు.
కాగా, వారాంతాల్లో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్‌లలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఫామ్‌హౌస్ పేర్లతో నిర్వాహకులు గలీజ్ దందా నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యువతకు మత్తు పదార్థాలు అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను రప్పించి అసభ్య, అర్ధనగ్న డ్యాన్సులు చేయిస్తూ వ్యభిచారం చేయిస్తున్నారు.