హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ ) మేయర్ గద్వాల విజయలక్ష్మికి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. పుట్టిన రోజు సందర్భంగా మేయర్ విజయలక్ష్మి ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, నటుడు తరుణ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Wishing you a year full of good Health and Happiness Mayor garu. On this occasion accompanied @GadwalvijayaTRS garu who has planted a sapling on her birthday today bracing #GreenIndiaChallenge along with Hon’ble MLA @DNRTRS garu @ActorTarun garu and others. pic.twitter.com/9XwIqGHMXx
— Santosh Kumar J (@MPsantoshtrs) June 21, 2021