బండ్లగూడ, సెప్టెంబర్ 1: డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీలు సంతోశ్‌కుమార్, రంజిత్‌రెడ్డి అన్నారు. బుధవారం అత్తాపూర్‌లో నూతనంగా కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదన్నారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీరాంరెడ్డి, సురేందర్‌రెడ్డి, అమరేందర్ పాల్గొన్నారు.